మెహిదీపట్నం : వినాయక చవితిని సందర్భంగా పూల ధరలకు రెక్కలొచ్చాయి. శుక్రవారం సిటీలో అతిపెద్ద పూలమార్కెట్ అయిన గుడిమల్కాపూర్‌లో వ్యాపారులు ధరలను రెండింతలు చేసి పూలను అమ్మారు. బయటి రాష్ట్రాలతోపాటు వికారాబాద్, శంకర్ పల్లి నుంచి బంతి, చామంతి, గులాబి, వివిధ రకాల పూలు వచ్చాయి.
మామూలు రోజుల్లో రూ.30–50 ఉండే కిలో బంతిపూలు శుక్రవారం రూ.100కు పైగా పలికాయి. కిలో చామంతి రూ.150 నుంచి రూ.200 పైగా పలికాయి. గులాబీలు రూ.200 నుంచి రూ.300 అమ్మారు.