రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడి..ఆహారంలో ఎలుకల మలం

రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడి..ఆహారంలో ఎలుకల మలం

హైదరాబాద్ లో పలు హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార పరిశుభ్రతపై నిర్లక్ష్యంగా ఉంటున్నారు నిర్వాహకులు.హోటళ్లు, రెస్టారెంట్లలో తినాలంటే నగరవాసులు జంకు తున్నారు. వడ్డించే ముందు భాగంలో విద్యుత్ లైట్లతో అలంకరించి అందంగా ఆకర్షనీయంగాతయారు చేస్తున్న నిర్వాహకులు.. ఆహార పదార్థాలు తయారు చేసే వంట గదులను అపరిశుభ్రతకు నిలయం మారుస్తున్నారు. కేవలం ఆహారం అందించడం అంటే ఓ బిజినెస్ లా చూస్తున్నారు తప్పా..నాణ్యమైన ఫుడ్ ను కస్టమర్లకు అందించాలన్న బాధ్యతను విస్మరిస్తున్నారు. బుధవారం ఆగస్టు 14,2024 హైదరాబాద్ లోని బేగంపేటలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. 

బేగంపేటలో మనోహర 5స్టార్ హోటల్, ఊర్వశీ బార్ అండ్ రెస్టారెంట్, చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై దాడులు నిర్వహించారు.ఈ హోటళ్లు, రెస్టారెంట్లలో వంటగదుల నిర్వహణపై అధ్వాన్నంగా ఉందని గుర్తించారు. కుళ్లిన ఆహారపదార్థాలు, ఎలుకలు, కీటకాలు తిరుగుతున్న వంటగది పరిసరాలు, కిచెన్ లో ఫ్లోర్ లో మురుగు నీరు నిలిచిపోయి ఉండటంతో నిర్వాహకులను మందలించారు. ఆహార పదార్థాలపై ఎలుకల మలం, కుళ్లి పోయిన ఆహారపదార్థాలు,ప్యాంట్రీలో పాడైపోయిన కూరగాయ లను అధికారులు గుర్తించారు. 

డ్రెయిన్లు సక్రమంగా శుభ్రం చేయకపోవడంతో నీరు నిలిచిపోయింది. వంటగదిలో సజీవ బొద్దింక బెడద కనిపించాయి. బ్రెడ్ తయారు చేసి కోల్డ్ స్టోరేజీలో ఉంచగా ఎలాంటి కవర్ లేకుండా కనిపించింది. మనోహర్ 5స్టార్ హోటల్ లో ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించడంలో పూర్తిగా విఫలమైందని అధికారులుగుర్తించారు. 

నాణ్యమైన ఫుడ్ అందించాల్సిన హోటల్ నిర్వాహకులు.. నిబంధనలు గాలికొదిలి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజులుగా హైదరాబాద్ లోని బేగంపేటలో పలు రెస్టారెంట్లు, హోటళ్లపై నిర్వహించిన దాడుల్లో హోటళ్ల నిర్వహణలో ఎలాంటి నిబంధనలు పాటించడం లేదని ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. ఇటువంటి హోటళ్లపై చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.