కళ్లు నెత్తికెక్కాయా రా : దిగిన.. స్కూల్ బస్సు కింద పడి నాలుగేళ్ల చిన్నారి మృతి

కళ్లు నెత్తికెక్కాయా రా : దిగిన.. స్కూల్ బస్సు కింద పడి నాలుగేళ్ల చిన్నారి మృతి

కళ్లు నెత్తికెక్కాయా.. కళ్లు కనిపించటం లేదా.. కళ్లు మూసుకుని డ్రైవింగ్ చేస్తున్నారా.. పిల్లలను దింపిన తర్వాత ముందూ వెనకా చూసుకోవాల్సిన బాధ్యత స్కూల్ బస్సు డ్రైవర్, అటెండర్ కు లేదా.. ఇదంతా ఎందుకు అంటారా.. హైదరాబాద్ సిటీలో జరిగిన ఘోరం అలాంటిది మరి.. 2025, ఫిబ్రవరి 6వ తేదీ సాయంత్రం జరిగిన ఈ ఘటన కన్నీళ్లు తెప్పిస్తుంది. 

పెద్ద అంబర్ పేటకు చెందిన రిత్విక అనే నాలుగేళ్ల చిన్నారి.. హయత్ నగర్ లోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లో LKG చదువుతుంది. రోజు మాదిరిగానే గురువారం కూడా ఉదయం బస్సులోనే స్కూల్ కు వెళ్లింది. సాయంత్రం స్కూల్ అయిన తర్వాత.. స్కూల్ బస్సులో ఇంటికి వచ్చింది. ఇంటి దగ్గరకు వచ్చిన బస్సు నుంచి కిందకు దిగింది చిన్నారి రిత్విక..

బస్సు దిగిన చిన్నారి.. బస్సు నుంచి దూరంగా వెళ్లిందా లేదా.. బస్సు దగ్గరలో ఉందా.. బస్సు వెనకాల ఉందా అనే విషయాన్ని గమనించకుండానే బస్సు డ్రైవర్.. స్కూల్ బస్సును రివర్స్ చేశాడు. దీంతో బస్సు వెనకాల ఉన్న చిన్నారి రిత్విక స్కూల్ బస్సు టైర్ల కింద పడి నలిగిపోయింది. అప్పటికి స్పృహలోకి వచ్చిన బస్సు డ్రైవర్.. అటెండర్.. ఆ వెంటనే చిన్నారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆ చిన్నారి చనిపోయింది.

స్కూల్ బస్సు అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి డ్రైవర్.. ముందూ వెనకా చూసుకోవాలి కదా.. నాలుగేళ్ల చిన్నారికి ఏం తెలుసు.. బస్సు ముందుకు వెళుతుందా వెనక్కి వస్తుందా అనేది.. ఈ ఘటన స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే జరిగిందంటున్నారు స్థానికులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు పోలీసులు.