హైదరాబాద్: ఓయో రూంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న కొరియోగ్రాఫర్ను, స్టాక్ మార్కెట్ అనలిస్ట్ను, ఆర్కిటెక్ట్ను, మరొకరిని సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. డిసెంబర్ 1న, ఆదివారం.. గచ్చిబౌలి డీఎల్ఎఫ్ రోడ్లోని ఓయో బొటిక్ హోటల్పై పోలీసులు రైడ్స్ చేశారు. ఈ రైడ్స్లో ఒక ఓయో రూంలో గంజాయి తీసుకుంటూ నలుగురు వ్యక్తులు అడ్డంగా దొరికిపోయారు. 18 గ్రాముల గంజాయిని, ఎల్ఎస్డీ పేపర్ను పోలీసులు సీజ్ చేశారు.
Also Read : శోభిత మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి
బెంగళూరుకు చెందిన గులిపల్లి గంగాధర్ అనే స్టాక్ అనలిస్ట్, కన్హా మెహంతి అనే కొరియోగ్రాఫర్, ప్రియాంక రెడ్డి అనే ఆర్కిటెక్ట్, షాకీ అనే ప్రైవేట్ ఉద్యోగిని పోలీసులు ఈ కేసులో అరెస్ట్ చేశారు. వీరిలో గంగాధర్, మెహంతీని డ్రగ్ పెడ్లర్స్గా పోలీసులు గుర్తించారు. బెంగళూరులో ఉండే ఒక ఆఫ్రికన్ నుంచి ఈ డ్రగ్స్ తెచ్చుకున్నట్లు నిందితుడు తెలిపినట్లు సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్స్ టీం డీసీపీ డి శ్రీనివాస్ తెలిపారు. ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి ఆ నలుగురిలో ఒక నిందితుడైన కొరియోగ్రాఫర్.