- ఈ నెల 16న ఘటన..ఆలస్యంగా వెలుగులోకి
గచ్చిబౌలి, వెలుగు : హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ మెస్‌లో సర్వ్ చేసిన చికెన్ బిర్యానీలో కప్ప వచ్చింది. ఈ నెల 16న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ట్రిపుల్ ఐటీకి చెందిన కదంబ మెస్‌లో ఇద్దరు స్టూడెంట్స్ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశారు. అందులో ఓ స్టూడెంట్ ప్లేట్‌లో చికెన్ముక్కలతో పాటు కప్ప కళేబరం రావడంతో వారు కంగుతిన్నారు.
వెంటనే మెస్ ఇన్‌చార్జికి స్టూడెంట్స్ ఫిర్యాదు చేశారు. బిర్యానీలో వచ్చిన కప్ప ఫొటోను స్టూడెంట్స్ ఫొటో తీసి, ఈ నెల 17న ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. మెస్‌పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్‌కు ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.