28వ తేదీ వరకు హైదరాబాద్ మొత్తం ఉరుములు, మెరుపులతో వర్షం

ఇవాళ్లి నుంచి సెప్టెంబర్ 28 వరకు హైదరాబాద్ నగరంలో సాయంత్రం, రాత్రి పూట వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.  ఇవాళ (సెప్టెంబర్ 25న)  నగరంలోని అన్ని ప్రాంతాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని ఎల్లో అలెర్ట్ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 

మూడు రోజులు పాటు నగరంలోని చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎల్‌బి నగర్, సికింద్రాబాద్, సెరిలింగంపల్లి - మోస్తారు నుంచి తేలిక పాటి వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.