హైదరాబాద్:నకిలీ ఫింగర్ ప్రింట్స్ తో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల హాజరు వేసి కమిషన్లు దండుకుంటున్న జీహెచ్ ఎంసీ ఉద్యోగిని సెంట్రల్ క్రైమ్ అధికారులు పట్టుకున్నారు. అతనితోపాటు పనిచేస్తున్న 22 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సింథటిక్ వేలిముద్రలను, ఉద్యోగుల హాజారు నమోదుకు ఉపయోగించే బయోమెట్రిక్ యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు.
గోషా మహల్ సర్కిట్ 14,జీహెచ్ ఎంసీలో శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న సబావత్ రవికుమార్ తన అధీనంలో ఉన్న డూప్లికేట్ వేలిముద్రలు తయారు చేసి వారి హాజరును గుర్తించేందుకు ఉపయోగించి, వారి నుంచి కమిషన్ వసూలు చేశాడు.
అయితే ఇదే నకిలీ ఫింగర్ ప్రింట్స్ కేసులో సెప్టెంబర్ 15 న గోషా మహల్ జీహెచ్ ఎంసీ సర్కిల్ 14 లో శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న సాయినాథ్, నాగరాజులను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. వారినుంచి 31 నకిలీ సింథటిక్ వేలిముద్రలు, మూడు బయోమెట్రిక్ మెషీన్లను స్వాధీనం చేసుకున్నారు.
ALSO READ : నమ్ముకుంటే నట్టేట ముంచారు.. కన్నీటి పర్యంతమైన సుభాష్ రెడ్డి