టౌన్ ప్లానింగ్ కళ్లకు గంతలు

టౌన్ ప్లానింగ్ కళ్లకు గంతలు

 కూకట్ పల్లి ,వెలుగు: హైదరాబాద్ నగరానికి ప్రణాళిక బద్దంగా అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ యోచనకు ఆచరణలో నీరుగారుతున్నది. అక్రమ నిర్మాణాలు విరివిగా వెలుస్తున్నాయి. అక్రమ నిర్మాణాలను నియంత్రించాలని టౌన్ ప్లానింగ్, విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్ చూసీ చూడనట్లుగా వ్యవహరించడం అక్రమార్కులకు వెసలుబాటగా మారింది. జీహెచ్ ఎంసీ అనుమతులు లేకుండా 200 వందల గజాల స్థలాల్లో సెల్లార్లు, ఐదు అంతస్తుల నిర్మాణాలు చక చక సాగిపోతున్నాయి. జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది నిర్లక్ష్యనికి నిలువుటద్దంగా నిర్మాణాలు వెలుస్తున్నాయి. స్థానిక జీహెచ్ఎంసీ సిబ్బంది అందడండలతోనే బిల్డర్లు యదేచ్ఛగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఇరుగు పొరుగు వారు ఫిర్యాదు చేస్తే భవన నిర్మాణదారులకు నోటీసులు ఇచ్చి జీహెచ్ఎంసీ సిబ్బంది చేతులు దులుపుకుంటున్నారు. నోటీసులను ఆసరాగా చేసుకుని న్యాయస్థానాలను ఆశ్రయించి బిల్డర్లు స్టే ఉత్తర్వులతో నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. మరీ గట్టి ఫిర్యాదు అయితే జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది గోడలను కూల్చివేతలకు పరిమితం అవుతున్నారు.

కూకట్ పల్లి సర్కిల్ లో వందలాది అక్రమ నిర్మాణాలు ….

కూకట్ పల్లి సర్కిల్ లో హైదరనగర్ డివిజన్ లో శ్రీనివాస నగర్,ఆడ్డగుట్ట సోసైటి  సమతా నగర్ ,జయానగర్ లో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. సమతా నగర్ లో పార్క్ ఎదురుగా ఓ బిల్డర్ రెండు వందల గజాలలో జీ ప్లస్ టూ రె సిడెన్షియల్ అనుమతి తీసుకుని సెట్ బ్యాక్ లేకుండా ఐదు అంతస్థులు నిర్మించారు. ఆడ్డగుట్ట సొసైటీ ఐతే మరీ అధ్వాన్నం . ఏడుఎనిమిది మంది బిల్డర్లు  అడ్డగుట్టలో తప్ప ఎక్కడా వ్యాపారం చేయరు. స్టిల్ట్ ప్లస్ త్రీ ప్లో ర్ రె సిడెన్సియల్ అనుమతులు తీసుకుని సెట్ బ్యాక్ లు లేకుండా ఐదు , ఆరు అంతస్తులు కడుతున్నారు. ప్రగతి నగర్ నుంచి జేఎన్టీయూ కు వచ్చే దారిలో ప్లాట్ నెంబర్ 271Aలో 200 గజాలలో సెల్లార్ ప్లస్ ఐదు అంతస్తులు నిర్మిస్తున్నారు. అలాగే  ఎదురుగా ఉన్న రోడ్డులో నిర్మాణాలు అన్నీ అక్రమ నిర్మాణాలే. ఈ కాలనీలో అపార్ట్ మెంట్ లకు అనుమతి లేదని కాలనీ వారు తీర్మాణించుకుని మరీ బోర్డు పెట్టుకున్న హెచ్ఎంటీ హిల్స్ కాలనీలో బోర్గు పక్కనే ప్లాట్ నెంబర్ 598లో 250 గజాల్లో  ఐదు అంతస్తుల అక్రమ అపార్ట్మెంటు కట్టి అమ్ముడున్నాడో బిల్డర్. ఆదే కాలనీలో పక్కపక్కనే ఇంకో మూడు అక్రమ నిర్మాణాలు సాగుతున్నాయి.

శివపార్వతి దియేటర్ వెనుక రోడ్డు విజేత డిగ్రీ కాలేజి దగ్గర అడ్డగుట్ట  వెస్ర్టన్ హిల్స్ నాలుగో రోడ్డులో ప్లాట్ నెం112,113 లలో 300 గజాల్లో ఐదు అంతస్ధులు , అదే రోడ్డులో ఓ కార్పోరేటర్ నా పార్ట్ నర్ అని చెప్పుకునే ఓ బిల్డర్ సెల్లార్ ప్లస్ ఐదు అంతస్థులు నిర్మించారు. ఇక ఆల్విన్ కాలనీ డివిజనల్ కూడా విపరీతంగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఆల్విన కాలనీ లాస్ట్ బస్టాప్ లో, ఆల్విన్ కాలనీ, తులసీ నగర్ , ఆదిత్యనగర్, హుడా పా ర్క్ కు ఎదురుగా శుభోధయ కాలనీ లలో అక్రమ నిర్మాణాలు సాగుతున్నాయి. వివేకానంద నగన్ డివిజన్ పరిధిలో జగద్గిరిగుట్ట నుంచి కెపిహెచ్ బికి వచ్చే మెయిన్ రోడ్డలో హెచ్ పి పెట్రోల్ బంక్ పక్కన అక్రమ నిర్మాణాలు నిర్మిస్తున్నారు. సర్దార్ పాపా రాయుడు నగర్, బాలకృష్టనగర్లలో కూడా జోరుగా అనుమతిలేని , అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. కూకట్ పల్లి డివిజన్ లో మైత్రి నగర్,శేషాద్రి నగర్ బాగ్ అమీర్ లలో జోరుగా సాగుతన్నాయి.

బాలానగర్ డివిజన్ లో వేళ్ల మీద లెక్క పెట్టేవిగా నిర్మాణాలు జరుగుతున్న బోయిన్ పల్లి డివిజన్లో మాత్రం చాలానే జరుగుతున్నాయి. మొత్తంగా కూకట్ పల్లి సర్కిల్ లో అక్రమ నిర్మాణాలు మాత్రం వందల సంఖ్యలోనే జోరుగా ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగుతున్నాయి. అక్రమనిర్మాణాలను జరగకుండా చూడాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని స్థానిక ప్రజలు విమర్శిస్తున్నారు.

బిల్డర్లకు అధికారుల అండదండలు

గతంలో కూకట్ పల్లి టౌన్ ప్లానింగ్ ఏసీపీగా పనిచేసి సస్సెండ్ అయిన అధికారి బిల్డర్లకు సహకరించడం వల్లే అక్రమ నిర్మాణాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందనే ఆరోపణలు ఉన్నాయి. కూకట్ పల్లి సర్కిల్ ఏసీపీ, టీపీబీవో సస్పెండ్ కావడంతో గత నాలుగు నెలలుగా సర్కిల్ టౌన్ ప్లానిం గ్ విభాగంలో పనిచేస్తున్న అధికారి అక్రమార్కులకు సహకరిస్తున్నారనే విమర్శలున్నాయి.