
- సీ అండ్ డీ వ్యర్థాలు డంప్ చేస్తే రూ.లక్ష వరకు ఫైన్లు
- ఇంతకుముందు మాన్యువల్‌గా
- శుక్రవారం నుంచి ఆన్లైన్లోనే...
- రోడ్లపై చెత్త వేస్తే రూ.500 నుంచి జరిమానా వసూలు
- సీ అండ్ డీ వ్యర్థాలకు మొదటిసారి రూ.25 వేలు, రెండోసారి 50 వేలు, మూడోసారి రూ.లక్ష ఫైన్
హైదరాబాద్ సిటీ, వెలుగు:గ్రేటర్ రోడ్లపై చెత్త వేస్తే ఇన్నాళ్లు మాన్యువల్‌గా ఫైన్ వేస్తున్న బల్దియా అది వర్కవుట్కాకపోవడంతో కొత్త పద్ధతిని ఎంచుకున్నది. రోడ్లపై చెత్త వేసేవారికి, రెండు డస్ట్ బిన్లు మెయింటెయిన్చేయని వాణిజ్య సంస్థలకు, కన్ స్ట్రక్షన్ అండ్ డిమాలిష్(సీ అండ్ డీ) వ్యర్థాలను బయట పారబోస్తున్న వారికి ట్రాఫిక్‌పోలీసుల తరహాలో చలాన్ రూపంలో ఆన్లైన్ లో జరిమానాలు విధించనున్నది. ఇందులో సీఅండ్ డీ వ్యర్థాలకైతే భారీగా జరిమానాలు ఉన్నాయి.
ఫస్ట్‌టైం వాహనాల్లో తీసుకువచ్చి రోడ్ల పక్కన డంప్ చేస్తే రూ.25 వేలు, రెండోసారి చేస్తే రూ.50 వేలు మూడోసారి చేస్తే రూ.లక్ష ఫైన్వేయనున్నది. ఇక రోడ్లపై ఫస్ట్‌టైం చెత్త వేస్తే రూ.500, రెండోసారి రూ.వెయ్యికిపైగా, మూడో సారి అంతకుమించి ఫైన్లు విధించనున్నది. బైకులు, ఆటోలు, కార్లపై వచ్చి చెత్త వేస్తే వారి వాహనాల నంబర్ల ఆధారంగా ఫైన్లు వేయనున్నది.
దీనికోసం ప్రత్యేకంగా కాంప్రెహెన్సివ్ చలాన్ మేనేజ్ మెంట్ సిస్టం(సీసీఎంఎస్) పేరుతో ఓ యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా సర్కిల్ ఆఫీసర్లకు ప్రత్యేకంగా లాగిన్ ఐడీలు ఇచ్చారు. ఆ ఐడీల ఆధారంగా ఫైన్లు జనరేట్ చేయనున్నారు. శుక్రవారం నుంచే దీన్ని పక్కాగా అమలు చేయనున్నారు.
సర్కిల్ అధికారులకు పవర్స్..
పైలట్ ప్రాజెక్టులో భాగంగా ముందు సర్కిల్ స్థాయి ఆఫీసర్లకు చలాన్విధించే అధికారం కట్టబెట్టనున్నారు. టౌన్ప్లానింగ్అసిస్టెంట్సిటీ ప్లానర్, మెడికల్ఆఫీసర్లు, డీఈఈ (డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ఇంజినీర్) ఎప్పుడూ ఫీల్డ్‌లో ఉంటారు. ఎవరైనా చెత్త వేస్తే వీరు వెంటనే కనిపెట్టే అవకాశం ఉంటుంది. వీరికి చలాన్లు వేసే అధికారం ఇవ్వడంతో సమస్య చాలా వరకు తగ్గుతుందని బల్దియా భావిస్తోంది.
కొద్దిరోజుల తర్వాత శానిటరీ సూపర్ వైజర్లు, ఎస్ఎఫ్ఏలకు కూడా యాప్ లాగిన్లు ఇచ్చి భాగస్వాములను చేయనున్నారు. యాప్‌లో చలాన్లు విధించడంతో ఆ వివరాలు ఉన్నతాధికారులు చూసే అవకాశం ఉంటుంది. వాటిని తొందరగా కలెక్ట్ చేయాలన్న భయం కూడా కింది స్థాయి ఆఫీసర్లలో ఉంటుంది. ఈ చలాన్లన్నీ ఆన్‌లైన్‌లో మాత్రమే చెల్లించాల్సి ఉండడంతో అవకతవకలకు అవకాశం కూడా ఉండదు.
ముఖ్యంగా సీఅండ్ డీ వ్యర్థాల ఫైన్ల వసూళ్ల విషయంలో సీరియస్ గా ఉండాలని ఉన్నతాధికారులు కింది స్థాయి అధికారులకు సూచిస్తున్నారు. ఒకవేళ ఫైన్లు చెల్లించకపోతే వారు కూల్చిన ఇంటి స్థానంలో కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకుంటే బల్దియా అనుమతి తప్పనిసరి అనే నిబంధన తేనున్నారు.
యాప్ వినియోగంపై శిక్షణ...
యాప్‌వినియోగంపై అసిస్టెంట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫసీర్లు(ఏఎంహెచ్ఓ), డిప్యూటీ ఈఈలు, టౌన్ ప్లానింగ్ ఏసీపీలకు బుధవారం బల్దియా హెడ్డాఫీసులో శిక్షణ ఇచ్చారు. అడిషనల్ కమిషనర్లు అనురాగ్ జయంత్, రఘుప్రసాద్ తో పాటు జాయింట్ కమిషనర్, టీజీ ఆన్ లైన్ ప్రతినిధులు యాప్ పనితీరు గురించి వివరించారు. ఫైన్ వేసిన ప్రాంతం ఫొటో, వేసిన చెత్తతోపాటు మరిన్ని వివరాలు యాడ్ చేసి యాప్ లో చలాన్జనరేట్చేయాల్సి ఉంటుందని వివరించారు. చలాన్లను చెల్లించాలని సంబంధిత వ్యక్తులకు ఫోన్ ద్వారా మెసేజ్‌లు కూడా పంపనున్నారు.