BCCI Under-19: చరిత్ర సృష్టించిన హైదరాబాద్ అమ్మాయిలు.. జాతీయ క్రికెట్ జట్టుకు ఒకేసారి ఏడుగురు ఎంపిక

BCCI Under-19: చరిత్ర సృష్టించిన హైదరాబాద్ అమ్మాయిలు.. జాతీయ క్రికెట్ జట్టుకు  ఒకేసారి ఏడుగురు ఎంపిక

హైదరాబాద్ అమ్మాయిలు రికార్డు సృష్టించారు. జాతీయ క్రికెట్ జట్టులోకి ఒకేసారి ఏడుగురు సెలెక్ట్ అయ్యి రికార్డు సృష్టించారు. బీసీసీఐ అండర్19 జట్టులోకి ఒకేసారి ఏడుగురు సెలెక్ట్ కావడం ఇదే మొదటి సారి కావడం విశేషం. హైదరాబాద్ నగరం గర్వించదగిన విషయంగా క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు.

 ఎంపికైన వారిలో కే.నిధి, సంధ్య గోరా, కావ్యశ్రీ, జాస్మిన్ గిల్,  పీవీ హంసకి, సీపీ పార్వతి, ఈ.శృజన అనే సిటీ క్రికెట్ ప్లేయర్లు ఉన్నారు. త్వరలోనే రాంచీలో జరగనున్న జట్టు ఏ శిబిరంలో నిధి, సంధ్య , కావ్యశ్రీ లు శిక్షణకు హాజరవుతారు.  అదే సమయంలో టీమ్ -డీ లో డెహ్రాడూన్ లో నిర్వహించే శిక్షణకు హంసిక, పార్వతి, సృజన హాజరుకానున్నారు. టీమ్-బీలో భాగంగా అహ్మదాబాద్ లో నిర్వహించే శిక్షణ శిబిరానికి జాస్మిన్ గిల్ పాల్గొంటుంది. 

వీరంతా హైదరాబాద్ నుంచి బీసీసీఐ అండర్ -19 క్రికెట్ శిక్షణ శిబిరాల్లో పాల్గొనున్నారు. ఏప్రిల్ 25 నుంచి మే 21 వరకు శిక్షణ శిబిరాల్లో పాల్గొనున్నారు. శిక్షణ ముగిసిన తర్వాత ఈ యువ క్రీడాకారిణులు  జాతీయ స్థాయి వేదికలపై క్రీడా నైపుణాన్ని ప్రదర్శించనున్నారు.