నా జుట్టు నాకు కావాలి.. బ్యూటీ పార్లర్ సీజ్ చేయాలని బాధితురాలి డిమాండ్

నా జుట్టు నాకు కావాలని బ్యూటీ పార్లర్ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. బ్యూటీ పార్లర్ ను సీజ్ చేయాలని డిమాండ్ చేసింది. హెయిర్ కలర్ కోసం అబిడ్స్ లోని న్యూ క్వీన్ బ్యూటీ సెలూన్ కి వచ్చానని.. స్పెషల్ హెయిర్ స్టైల్ చేస్తానని తన హెయిర్ మొత్తం కాలిపోయేలా చేసిందని వాపోయింది. పార్లర్ నిర్వహకురాలు సొంతగా తయారు చేసిన హెర్బల్ హెయిర్ ఆయిల్ వాడమని చెప్పిందని తెలిపింది. అది వాడితే పూర్తిగా తన జుట్టు రాలిపోయిందని చెప్పింది. 

ALSO READ:భర్త కోసం పొట్ట మాడ్చుకున్న భార్య... మండిపడుతున్న నెటిజన్లు

జుట్టుపై నీళ్లు పోసినా.. జుట్టులో దువ్వెన పెట్టినా వెంట్రుకలు బాగా రాలిపోతున్నాయని పేర్కొంది. దీంతో తన జుట్టు పూర్తిగా మంచిగా అయ్యేలా బ్యూటీ పార్లార్ నిర్వహకులు ట్రీట్మెంట్ చేపించాలని డిమాండ్ చేసింది. అంతేకాకుండా క్వీన్ పార్లర్ ను వెంటనే సీజ్ చేయాలని తెలిపింది. పార్లర్ నిర్వహకులపై అబిడ్స్ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరింది.