తెలంగాణకు భారీ కంపెనీలు రాబోతున్నాయి.. 5800 మందికి జాబ్స్ పక్కా: మంత్రి శ్రీధర్

తెలంగాణకు భారీ కంపెనీలు రాబోతున్నాయి.. 5800 మందికి జాబ్స్ పక్కా: మంత్రి శ్రీధర్

హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ లైఫ్ సైన్స్‎కి హబ్‎గా మారిపోయిందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. లైఫ్ సైన్సెస్ సెక్టార్‎లో గత 10 నెలల్లో 140 ప్రాజెక్ట్స్ వచ్చాయని.. రూ.36000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చామని తెలిపారు. దీనివల్ల 51,000ల మందికి ప్రత్యక్ష ఉపాధి, 1.5 లక్షల మందికి పరోక్షణగా ఉపాధి లభించనుందన్నారు. ప్రభుత్వం మారినా పథకాలను కొనసాగిస్తూ.. మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. 

జీనోమి వ్యాలీ థర్డ్ ఫేజ్‎లో భాగంగా రాష్ట్రానికి భారీ కంపెనీలు వస్తున్నాయని.. యూరోపియన్‏కి చెందిన క్రికా సంస్థ రూ.2000 కోట్లతో తమ ప్లాంట్‎ని ఏర్పాటుచేయబోతుందని తెలిపారు.  దీని ద్వారా 2800 మందికి ఉద్యోగాలు రాబోతున్నాయని పేర్కొన్నారు. జీనోమి వ్యాలీలో ఏడాదికి 5 కోట్ల డెంగ్యూ వాక్సిన్‎లు ప్రొడ్యూస్ చేయబోతున్నారని వెల్లడించారు. వరల్డ్ లీడింగ్ బొయిటెక్నాలజీ కంపెనీ Amgen కూడా తమ సెంటర్‎ని హైదరాబాద్‏లో ఏర్పాటు చేయబోతుందని.. తద్వారా 3000 వేల మందికి ఉద్యోగావకాశాలు దక్కనున్నాయని తెలిపారు.