హైదరాబాద్, వెలుగు: కెప్టెన్ గొంగడి త్రిష (57 బాల్స్‌లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 73) హాఫ్‌సెంచరీతో సత్తా చాటడంతో బీసీసీఐ విమెన్స్ అండర్23 టీ20 ట్రోఫీలో హైదరాబాద్ క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. ఇండోర్‌లో సోమవారం జరిగిన ప్రి క్వార్టర్ ఫైనల్లో హైదరాబాద్ 3 రన్స్ తేడాతో ఆంధ్ర జట్టును ఓడించింది. తొలుత హైదరాబాద్ 20 ఓవర్లలో 124/4 స్కోరు చేసింది.
ఛేజింగ్‌లో ఓవర్లన్నీ ఆడిన ఆంధ్ర 121/8 స్కోరు మాత్రమే చేసి ఓడింది. పుష్పలత (58) పోరాడగా యశశ్రీ 3వికెట్లు పడగొట్టింది. బుధవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో ఢిల్లీతో హైదరాబాద్ పోటీ పడనుంది.