![పట్టణ జనాభాలో అగ్రస్థానంలో హైదరాబాద్](https://static.v6velugu.com/uploads/2022/11/Hyderabad-has-the-highest-urban-population_HSFcIKkYTi.jpg)
రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత పట్టణ జనాభాలో అగ్రస్థానంలో హైదరాబాద్ (100శాతం), మేడ్చల్ మల్కాజిగిరి (91.4శాతం) ఉన్నాయి. వరంగల్ అర్బన్ (68.5శాతం), రంగారెడ్డి (57.7శాతం), మంచిర్యాల(43.8శాతం) జిల్లాలు కూడా రాష్ట్ర సగటు పట్టణ జనాభా (38.8శాతం) ఎక్కువగా ఉన్నాయి. ఇతర 26 జిల్లాలు రాష్ట్ర సగటు పట్టణ జనాభా కంటే తక్కువగా ఉన్నాయి. పెద్దపల్లి (38.2శాతం), సంగారెడ్డి (34.7శాతం), భద్రాద్రి (31.7శాతం), కరీంనగర్ (30.7శాతం) జిల్లాలు పట్టణ జనాభాలో 30 నుంచి 40శాతం మధ్యలో ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో పట్టణ జనాభాలో దాదాపు 30శాతం మంది ఉన్నారు. ఆదిలాబాద్, నల్లగొండ, ఖమ్మం, జగిత్యాల, నిర్మల్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో 20శాతం ఎక్కువ పట్టణ జనాభా ఉంది. కొమరం భీమ్, యాదాద్రి, వనపర్తి, సూర్యాపేట, సిద్దిపేట, వికారాబాద్, కామారెడ్డి, జనగాం, జోగులాంబ, నాగర్ కర్నూల్ జిల్లాలు రాష్ట్రంలోని పట్టణ జనాభాలో 10 నుంచి 20శాతం వరకు ఉన్నాయి. అత్యల్ప పట్టణ జనాభా మహబూబాబాద్ (9శాతం), మెదక్ (7.6శాతం), జయశంకర్ (7.5శాతం), వరంగల్ రూరల్ (6.99శాతం) జిల్లాల్లో ఉంది.
తెలంగాణలో 1921 తర్వాత ప్రతి దశాబ్దంలో పట్టణ వాటా క్రమంగా పెరుగుతూ 1951లో గరిష్ఠ స్థాయికి చేరుకుంది. 1951–61 తగ్గి, 1961 నుంచి స్థిరమైన పెరుగుదల ఉంది. చిన్న పట్టణాల జనాభా వాటా క్రమంగా తగ్గడం ప్రారంభించి, 1981లో 7.8శాతం నుంచి 2001లో 3శాతానికి తగ్గింది. 2001తో పోల్చితే 2011లో పట్టణ జనాభా వృద్ధి 7శాతం కంటే ఎక్కువగా ఉంది.