హైదరాబాద్ లో విషాదం నెలకొంది. మూడేళ్ల బాలుడిపైకి స్కూల్ బస్సు దూసుకెళ్లింది. దీంతో ఆ బాలుడు అక్కడిక్కడే మృతి చెందాడు. కండర్ షైన్ స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడం వల్లే ఈ ఘటన జరిగిందని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Also Read :- అమెరికాలో భారత విద్యార్థికి కత్తిపోట్లు
హయత్ నగర్ కుంట్లూర్ గ్రామానికి చెందిన బాలుడు హర్షపవన్ గా పోలీసులు గుర్తించారు. గతంలో ఇలాంటి ఘటన జరిగిన స్కూల్ యాజమాన్యం తీరు మాత్రం మారటం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.