హైదరాబాద్: గతవారం రోజులుగా ఇజ్రాయెల్, హమాస్ ఉగ్రవాదులకు మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్దంలో ఇరువర్గాలకు చెందిన వేల మంది చనిపోయారు. హమాస్ దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ గాజాపై దాడులు చేస్తోంది. ఈ సమయంలో పాలస్తీనాకు అనుకూల నిరసనలు చేపట్టిన హైదరాబాద్ పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.
Also Read :- కాంగ్రెస్కు మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా
బషీర్‌బాగ్‌లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలిపారు. గాజాపై బాంబు దాడి చేసిన ఇజ్రాయెల్‌ను ఖండిస్తూ నినాదాలు చేస్తూ పాలస్తీనియన్లకు సంఘీభావం తెలిపేందుకు మహిళా విద్యార్థినుల బృందం నిరసన ప్రదర్శన నిర్వహించింది. పాలస్తీనాకు లాంగ్ లివ్ అనే ప్లకార్డులతో విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. డౌన్ డౌన్ ఇజ్రాయెల్ అని నినాదాలు చేస్తున్న నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసు సిబ్బంది ఆందోళనకారులను పోలీసు వాహనంలో తరలించారు.