మూడు గంటలు.. కుండపోత

మూడు గంటలు.. కుండపోత
  • బన్సీలాల్​పేటలో అత్యధికంగా 7.63 సెం.మీ.వాన

హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ ​సిటీలో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. సెప్టెంబర్ 20 రాత్రి  9 గంటలకు మొదలైన వాన 12 గంటల వరకు కురుస్తూనే ఉంది. పగలంతా ఎండ దంచికొట్టగా, సాయంత్రం 6 గంటల తర్వాత వాతావరణం మారిపోయింది. మూడు గంటల పాటు ఏకధాటిగా భారీ వర్షం కురిసింది. దీంతో చాలాచోట్ల రోడ్లపై వరద నీరు నిలిచింది. హైడ్రా డీఆర్ఎఫ్ టీమ్స్, జీహెచ్ఎంసీ స్టాటిక్ టీమ్స్ రంగంలోకి దిగి నీటిని తొలగించాయి.

రాత్రి 12 గంటల వరకు నమోదైన వర్షపాతం

  • ప్రాంతం             వర్షం(సెం.మీ.)
  • బన్సీలాల్ పేట     7.63
  • గన్​ఫౌండ్రి             6.85
  • నాంపల్లి                 6.83
  • ఉప్పల్​                   6.70
  • పాటిగడ్డ                 5.98
  • మల్కాజిగిరి         5.90
  • ఖైరతాబాద్​          5.80
  • హిమాయత్ నగర్     5.75
  • అంబర్ పేట          5.68
  • చార్మినార్​              5.40
  • సికింద్రాబాద్         5.28
  • మారేడ్ పల్లి            5.45