హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. హైదర్ నగర్, కూకట్ పల్లి, జేఎన్టీయూ, మూసాపేట, అమీర్ పేట జగద్గిరి గుట్ట తదితర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. మోస్తరు వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా నీరు చేరింది. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లేందుకు ఉద్యోగులు, రోజువారీ పనులకు వెళ్లే ప్రజలు ట్రాఫిక్ లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వర్షం పడడంతో పలు చోట్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. తెలంగాణ వ్యాప్తంగా 7 రోజుల పాటు ( ఆగస్టు 14నుంచి) వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో వచ్చే నాలుగైదు రోజులు భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెస్తోంది. తెలంగాణని పలు జిల్లాలకు కూడా వర్ష సూచన ఉన్నా.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చినుకు జనాల్ని వణికిస్తోంది.
వర్షం పడుతుండటంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య నెలకొంది.వ ర్షం ధాటికి పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వర్షం దంచికొడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించిన నేపథ్యంలో మరో ఏడు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.