రగ్బీ ప్రీమియర్‌‌‌‌‌‌‌‌ లీగ్‌‌‌‌‌‌‌‌లో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ హీరోస్‌‌‌‌‌‌‌‌

రగ్బీ ప్రీమియర్‌‌‌‌‌‌‌‌ లీగ్‌‌‌‌‌‌‌‌లో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ హీరోస్‌‌‌‌‌‌‌‌

ముంబై: ప్రపంచంలో తొలి ఫ్రాంచైజీ ఆధారిత రగ్బీ ప్రీమియర్‌‌‌‌‌‌‌‌ లీగ్‌‌‌‌‌‌‌‌కు రంగం సిద్ధమైంది. జూన్‌‌‌‌‌‌‌‌ 1 నుంచి 15 వరకు ముంబై ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌ ఎరీనాలో లీగ్ జరుగుతుందని రగ్బీ ఇండియా, జీఎంఆర్‌‌‌‌‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ శుక్రవారం (April 5) వెల్లడించాయి. ఆరు ఫ్రాంచైజీలు పాల్గొనే ఈ టోర్నీలో 15 రోజుల పాటు 34 మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు జరుగుతాయి. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ హీరోస్‌‌‌‌‌‌‌‌, బెంగళూరు బ్రేవ్‌‌‌‌‌‌‌‌హార్ట్స్‌‌‌‌‌‌‌‌, చెన్నై బుల్స్‌‌‌‌‌‌‌‌, ఢిల్లీ రెడ్జ్‌‌‌‌‌‌‌‌, కళింగ బ్లాక్‌‌‌‌‌‌‌‌ టైగర్స్‌‌‌‌‌‌‌‌, ముంబై డ్రీమర్స్‌‌‌‌‌‌‌‌ ఫ్రాంచైజీలుగా ఉన్నాయి. 

అర్జెంటీనా, సౌతాఫ్రికా, కెన్యా, గ్రేట్‌‌‌‌‌‌‌‌ బ్రిటన్‌‌‌‌‌‌‌‌, న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌, ఆస్ట్రేలియా, స్పెయిన్‌‌‌‌‌‌‌‌, ఫిజి, అమెరికా, ఐర్లాండ్‌‌‌‌‌‌‌‌ నుంచి 30 మంది ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లు బరిలోకి దిగుతున్నారు. ‘ఈ టోర్నీ కోసం గ్లోబల్‌‌‌‌‌‌‌‌ రగ్బీ 7 క్యాలెండర్‌‌‌‌‌‌‌‌లో ప్రత్యేకమైన విండో కేటాయించాం. ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద స్టార్లు ఇందులో భాగస్వామ్యం అవుతున్నారు’ అని లీగ్‌‌‌‌‌‌‌‌ నిర్వాహకులు పేర్కొన్నారు.