
హైదరాబాద్, వెలుగు: బెట్టింగ్ యాప్స్ప్రమోషన్కేసులో పంజాగుట్ట, మియాపూర్ పోలీస్‌స్టేషన్‌లో దాఖలైన కేసుల్లో విచారణకు హా జరు కావాల్సిందేనని టీవీ యాంకర్ విష్ణుప్రియను హైకోర్టు ఆదేశించింది. అయితే, విష్ణు ప్రియను అరెస్టు చేయొద్దని, 35(3) బీఎన్ఎస్ఎస్ ఫాలో కావాలని పోలీసులను ఆదేశించింది. సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేసి చట్టప్రకారం విచారణ చేపట్టాలని తెలిపింది. పోలీస్ దర్యాప్తునకు సహకరించాలని విష్ణుప్రియకు సూచించింది.
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌పై పంజాగుట్ట, మియాపూర్ పీఎస్‌ల్లో కేసులను కొట్టివేయాలంటూ హైకోర్టులో యాంకర్ బి.విష్ణుప్రియ రెండు పిటిషన్లు దాఖలు చేశారు. శుక్రవారం ఆ పిటిషన్లను జస్టిస్ తుకారాంజీ విచారణ చేపట్టారు. పోలీసుల తరఫున ఏపీపీ జితేందర్‌రావు వాదనలు వినిపించారు.