ఐఏఎంసీకి భూమి కేటాయింపు కేసులో తీర్పు వాయిదా

ఐఏఎంసీకి భూమి కేటాయింపు కేసులో తీర్పు వాయిదా

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌‌‌లోని ఇంటర్నేషనల్‌‌ ఆర్బిట్రేషన్‌‌ అండ్‌‌ మీడియేషన్‌‌ సెంటర్‌‌ (ఐఏఎంసీ)కి 5 ఎకరాల భూమిని కేటాయించడాన్ని సవాల్‌‌ చేసిన పిటిషన్‌‌పై హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. మంగళవారం ఇరుపక్షాల వాదనలు పూర్తికావడంతో తీర్పును రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలోని సర్వే నంబర్‌‌ 83/1 ప్లాట్‌‌ నంబర్‌‌ 27 లోని 3.7 ఎకరాల ప్రభుత్వ భూమిని ఐఏఎంసీకి కేటాయిస్తూ 2021 నవంబర్‌‌ 26న అప్పటి ప్రభుత్వం జీవో విడుదల చేసింది.

 నిర్వహణ ఖర్చుల కింద అదనంగా రూ.3 కోట్లను మంజూరు చేస్తూ ఇంకో జీవో ఇచ్చింది. ఆ జీవోలను కొట్టివేయాలంటూ న్యాయవాది కె.రఘునాథ్‌‌ రావు వేసిన పిల్‌‌ను జస్టిస్‌‌ కె.లక్ష్మణ్, జస్టిస్‌‌ కె.సుజన ధర్మాసనం మంగళవారం విచారించింది. ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్‌‌రెడ్డి ఐఏఎంసీ తరఫున సీనియర్‌‌ న్యాయవాది దేశాయి ప్రకాశ్‌‌రెడ్డి వాదించారు. అనంతరం పిటిషనర్​ తరఫు అడ్వకేట్​ వాదనలు వినిపించారు. అనంతరం హైకోర్టు తీర్పును వాయిదా వేసింది.