హైదరాబాద్​ హోటల్స్​కు దండిగా డిమాండ్​

హైదరాబాద్​ హోటల్స్​కు దండిగా డిమాండ్​
  •     తరువాతి స్థానాల్లో బెంగళూరు, ఢిల్లీ, కోల్​కతా

న్యూఢిల్లీ : మనదేశంలో ఈ ఏడాదిలో అత్యధిక హోటల్​ బుకింగ్స్​ హైదరాబాద్​లోనే జరిగాయని హాస్పిటాలిటీ కంపెనీ ఓయో తెలిపింది. ఎక్కువ మంది దర్శించిన పుణ్యక్షేత్రాల లిస్టులో పూరి, వారణాసి, హరిద్వార్ ఉన్నాయని ఓయో ‘ట్రావెల్​పీడియా 2024’ వెల్లడించింది. దీని ప్రకారం.. దేవ్​గఢ్​, పళని, గోవర్దన్​ ప్రాంతాల్లోనూ రద్దీ బాగానే ఉంది. బుకింగ్స్​లో హైదరాబాద్​తరువాత స్థానంలో బెంగళూరు, ఢిల్లీ, కోల్​కతా నిలిచాయి.

మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటకలో ఖరీదైన హోటల్స్​ బుకింగ్స్​ భారీగా ఉన్నాయి. పట్నా, రాజమండ్రి, హుబ్లి వంటి చిన్న నగరాల్లోనూ బుకింగ్స్​పెరుగుతూనే ఉన్నాయి. ఇవి వార్షికంగా 48 శాతం అధికమయ్యాయి. సెలవుల కోసం ఎక్కువ మంది జైపూర్​ను ఎంచుకున్నారు. తరువాతి స్థానాల్లో గోవా, పుదుచ్చేరి, మైసూర్​ ఉన్నాయి. ముంబైలో మాత్రం బుకింగ్స్​ తగ్గాయి.