ఆ ఆరు చెరువులు అందంగా.. త్రీడీ ఫొటోలు విడుదల చేసిన హైడ్రా

ఆ ఆరు చెరువులు అందంగా.. త్రీడీ ఫొటోలు విడుదల చేసిన హైడ్రా

హైదరాబాద్ సిటీ, వెలుగు: చెరువుల పునరుద్ధరణకు హైడ్రా ప్రక్రియ ప్రారంభించింది.హెచ్ఎమ్ డీఏ ఫండ్స్​తో మొదటి దశలో ఉప్పల్ పెద్ద చెరువు, బతుకమ్మ కుంట, కూకట్​పల్లి నల్ల చెరువు, మాదాపూర్ తుమ్మిడి కుంట, సున్నం చెరువు, ఓల్డ్ సిటీ బుమృక్ దావాల చెరువుల పునర్నిర్మాణం చేస్తున్నట్టు తెలిపింది. త్వరలో టెండర్ వేయనున్నామని, డీపీఆర్ ఫైనల్ చేసినట్లు చెప్పింది. వీటికి సంబంధించిన 3డీ మోడల్ ఫొటోలు సిద్ధం చేసి విడుదల చేశారు. జూన్​లోపు ఆరు చెరువుల రెన్నోవేషన్​ ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపింది.