హైదరాబాద్లో పెరుగుతున్న అక్రమ ఆయుధాల విక్రయం

హైదరాబాద్లో పెరుగుతున్న అక్రమ ఆయుధాల విక్రయం

 అక్రమ ఆయుధాల విక్రయాలపై హైదరాబాద్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ  పక్క రాష్ట్రాల నుంచి గుట్టు చప్పుడు కాకుండా అక్రమ ఆయుధాలను కొనుగోలుచేస్తున్నారు. మే 17న హబీబ్ నగర్  పీఎస్  పరిధిలో రెండు గ్రూపుల మధ్య జరిగిన దాడుల్లో దాదాపు 7 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో 15 మందిని అరెస్ట్ చేశారు. అయితే   ఈ ఘటనలో ఎక్కువగా కత్తులు,కటార్లు, ఇనుపరాడ్లు ఉపయోగించారని పోలీసులు తెలిపారు. 

 అక్రమ ఆయుధాలు నాందేడ్, బీదర్, డెగ్లూర్  నుంచి అక్రమంగా హైదరాబాద్ కు తరలిస్తున్నట్లు   హైదరాబాద్ టాస్క్ పోలీసులు నిర్దారించారు. కొందరు నిరుద్యోగులు, అల్లరిమూకలు, రౌడీలు  ఆయుధాలను అరటి ట్రక్కుల్లో హైదరాబాద్ కు అక్రమంగా తరలిస్తున్నారు. ఆ తర్వాత  స్టోర్ చేసి అమ్ముతున్నట్లు గుర్తించారు. పలు వివాహా వేడుకల్లో ప్రదర్శించడానికి యువకులు ఈ ఆయుధాలను వాడుతున్నారు.