ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో.. వీక్లీ, మంత్లీ ఎగ్జామ్స్

  •     హైదరాబాద్ ఇంటర్మీడియట్ అధికారి వడ్డెన్న

హైదరాబాద్, వెలుగు : ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోని స్టూడెంట్లకు ప్రతి వారం, ప్రతి నెల.. వీక్లీ, మంత్లీ ఎగ్జామ్స్ నిర్వహించాలని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వడ్డెన్న  కాలేజీల ప్రిన్సిపాల్స్ ను ఆదేశించారు. తక్కువ మార్కులు వచ్చే స్టూడెంట్లకు స్పెషల్ క్లాసులు తీసుకోవాలన్నారు. శుక్రవారం జిల్లా ఇంటర్మీడియట్ ఆఫీసులో ప్రభుత్వ జూనియర్ కాలేజీల ప్రిన్సిపాల్స్​తో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.  

ALSO READ: బంజారా జాతీయ కమిషన్ ఏర్పాటు చేయండి 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రెగ్యులర్​గా కాలేజీలకు రాని స్టూడెంట్ల పేరెంట్స్​తో మాట్లాడి స్పెషల్ ఫోకస్ పెట్టాలన్నారు. లెక్చరర్ల టీచింగ్ డైరీలను ప్రతి రోజూ తనిఖీ చేసి సిలబస్ పూర్తయ్యేలా చూడాలని ప్రిన్సిపాల్స్​కు సూచించారు. స్టూడెంట్లు కాలేజీలకు వచ్చిపోయే ముందు వారిని గమనిస్తూ ఉండాల్సిన బాధ్యత టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్​దేనని వడ్డెన్న తెలిపారు.