ఒక సబ్జెక్టులో ఫెయిల్.. ఇంటర్​స్టూడెంట్​సూసైడ్

ఒక సబ్జెక్టులో ఫెయిల్.. ఇంటర్​స్టూడెంట్​సూసైడ్

ఎల్బీనగర్, వెలుగు: ఓ సబ్జెక్టులో ఫెయిల్​అవడంతో మనస్తాపానికి గురైన ఇంటర్​స్టూడెంట్ సూసైడ్​చేసుకుంది. నాగోలు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తట్టిఅన్నారం వైఎస్ఆర్ కాలనీలో ఉండే సుక్క రవికుమార్ కూతురు అరుంధతి(17) కొత్తపేటలోని నారాయణ కాలేజీలో ఇంటర్మీడియట్ ఫస్ట్​ఇయర్(బైపీసీ)​చదువుతోంది. మంగళవారం విడుదలైన ఫలితాల్లో అరుంధతి బోటనీ సబ్జెక్టులో ఫెయిల్​అయింది.

తన రిజల్ట్​చూసుకున్నాక తీవ్ర మనస్తాపానికి గురైన అరుంధతి ఇంట్లో ఉరి వేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు నాగోలులోని సుప్రజా హాస్పిటల్ కు తరలించారు. డాక్టర్లు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలి సోదరుడు గౌతమ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేస్​ఫైల్​చేశారు.