వర్షాకాలం అయిపోయింది.. వాయుగుండం ఎఫెక్ట్‌తో ఇప్పుడు హైదరాబాద్‌లో వర్షాలు పడుతున్నాయి.. మరో వారంలో అంతా సర్దుకుంటుంది.. చలికాలం ఎంట్రీతోనే.. వాతావరణ శాఖ వార్నింగ్ కూడా ఇచ్చేసింది. ఈసారి హైదరాబాద్‌లో చలి చంపేయటం ఖాయం అని.. అలా ఇలా కాదని.. అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. 2024 జనవరి సీజన్లోనే హైదరాబాద్ సిటీలో 8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఈసారి ఆ స్థాయి కంటే తక్కువగా.. అంటే 5, 6 డిగ్రీలు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఇండియన్ మెట్రాలజీ డిపార్ట్ మెంట్ హెచ్చరించింది.
కాగా, అక్టోబరు, -నవంబర్ మధ్య కాలంలో ఏర్పడే లా నినా పరిస్థితుల కారణంగా తెలంగాణలో ఈ ఏడాది శీతాకాలంలో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతాయని ఐఏండీ అంచనా వేసింది. మరీ ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఈ ఏడాది చలి గజ గజ వణికిస్తుందని తెలిపింది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ రికార్డ్స్ ప్రకారం.. లా నినా ప్రభావంతో రాష్ట్రంలో గతంలో కూడా కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. తెలంగాణలో చివరగా 2022 చలికాలంలో తక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. 2022లో రాజేంద్రనగర్, పటాన్చెరు వంటి ప్రాంతాల్లో 8 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లాలో 4 డిగ్రీల కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి.
ALSO READ | పత్తి కొనుగోలుకు ఏర్పాట్లు పూర్తి చేయండి : కలెక్టర్ ప్రావీణ్య
ఈ ఏడాది శీతాకాలంలో కూడా హైదరాబాద్‌లో అంతకంటే తక్కువ స్థాయికి అంటే 5, 6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే ఛాన్స్ ఉందని ఐఏండీ అంచనా వేసింది. మధ్య, తూర్పు పసిఫిక్‌లో సాధారణ సముద్ర ఉష్ణోగ్రతల కంటే వాతవరణం చల్లగా ఉంటుందని.. దీని ప్రభావతంతో తెలంగాణతో సహా భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో చలి ఎక్కువగా నమోదు అవుతోందని ఐఏండీ తెలిపింది. ఈ ఏడాది శీతాకాలం సవాల్‌తో కూడికున్నదని అంచనా వేసిన వాతావరణ శాఖ.. తక్కువ ఉష్ణోగ్రతల నమోదై ఉదయాన్నే పొగమంచు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. పొగ మంచు కారణంగా వాహనదారులకు ఇబ్బందులు పడి పరిస్థితి ఉంటుందని తెలిపింది.