సర్కారు బడి పిల్లలకు టాయిలెట్స్ కట్టించిన ఐటీ ఉద్యోగిని

సర్కారు బడి పిల్లలకు టాయిలెట్స్ కట్టించిన ఐటీ ఉద్యోగిని

గచ్చిబౌలి, వెలుగు: గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు టాయిలెట్స్ కట్టించి, ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని దంపతులు దాతృత్వం చాటుకున్నారు. హైదరాబాద్​లోని చందానగర్​కు చెందిన వీణ సజ్జన, ఆమె భర్త నవీన్​ కుమార్​ ఐటీ ఉద్యోగులు. శేరిలింగంపల్లి శాంతినగర్​లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో టాయిలెట్స్ సరిగా లేక స్టూడెంట్స్ ఇబ్బందులు పడుతున్నారని ఆమె దృష్టికి వచ్చింది. దీంతో తన ఫ్రెండ్స్, బంధువుల నుంచి రూ.3 లక్షల వరకు సేకరించారు. ఆ డబ్బుతో బాయ్స్, గర్ల్స్ కోసం వేర్వేరుగా టాయిలెట్స్​ నిర్మించారు. 

దాదాపు ఆరు నెలలు కష్టపడి విద్యార్థుల కష్టాలు తీర్చారు. ఈ సందర్భంగా శుక్రవారం వీణసజ్జన దంపతులను స్కూల్ హెచ్ఎం, సిబ్బంది, విద్యార్థులు సన్మానించి, వారి చేత టాయిలెట్స్ ప్రారంభించారు. వీణ గతంలోనూ చందానగర్​ చుట్టుపక్కల ప్రాంతాల విద్యార్థులకు ట్యూషన్ ఫీజులు, స్టేషనరీని స్పాన్సర్ చేశారు.