ఓ వైపు వర్షాలు... మరోవైపు ఇళ్లలోకి పాములు .. భయపడుతున్న జనాలు

ఓ వైపు వర్షాలు... మరోవైపు ఇళ్లలోకి పాములు .. భయపడుతున్న జనాలు

హైదరాబాద్‌ నగరంపై వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. గత 24 గంటలుగా నగరంలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. పలు ప్రాంతాల్లో వర్షానికి ఇల్లులు నీటమునిగాయి. రోడ్లు కొట్టుకుపోయాయి. .  హైదరాబాద్ కు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 

హైదరాబాద్​ లో  కురుస్తున్న భారీ వర్షానికి జవహర్ నగర్లోకి పలు ప్రాంతాలు జలమయమ య్యాయి.. ఒకవైపు వర్షాలు కురుస్తుండడం మరోవైపు చల్లటి వాతావరణం ఉండడంతో పాములు ఇళ్లలోకి వస్తున్న పరిస్థితి నెలకొంది. జవహర్ నగర్ లోని జ్యోతి కాలనీలో ఈరోజు ( ఆగస్టు20)  సాయంత్రం సమయంలో ఇంట్లోఅకస్మాత్తుగా పాము ప్రత్యక్షం కావడంతో ఇంట్లో ఉన్నవాళ్లు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పాములు పట్టే వారికి సమాచారం అందించడంతో ...  వచ్చి పామును సంచిలో తీసుకుని వెళ్లారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పాముల బెడద ఉండే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు  ప్రజలకు సూచించారు. ఇళ్ల సమీపంలో చెత్తాచెదారం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.