JNTU: హైదరాబాద్ జేఎన్టీయూ కొత్త వీసీ కిషన్ రెడ్డి.. ఉత్తర్వులు జారీ

JNTU: హైదరాబాద్ జేఎన్టీయూ కొత్త వీసీ కిషన్ రెడ్డి.. ఉత్తర్వులు జారీ

హైదరాబాద్  జవహర్ లాల్ నెహ్రూ టెక్నోలాజికల్ యూనివర్సిటీ (JNTU) వైస్ చాన్స్ లర్ గా టి. కిషన్ కుమార్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ గవర్న ర్ జిష్ణుదేవ్ వర్మ ఉత్తర్వులు జారీ చేశారు. కిషన్ కుమార్ రెడ్డి ఈ పదవిలో మూడేళ్లపాటు కొనసాగుతారు. 

గతేడాది మే 21న జేఎన్టీయూ వీసి పోస్టు ఖాళీ కాగా.. వీసీ పోస్టు భర్తీ కోసం ప్రభుత్వం పలుమార్లు ప్రయత్నించింది.. నియామక ప్రక్రియ రెండుసార్లు వాయిదా పడింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వడంతో వీసీ నియామకం కొలిక్కి వచ్చింది. 

ఇప్పటివరకు జేఎన్టీయూ కు ఇన్ ఛార్జ్ వీసీగా ఉన్నత విద్యామండలి చైర్మన్ వ్యవహరించారు. గవర్నర్ తాజా ఉత్తర్వులతో జేఎన్టీయూ వైస్ చాన్స్ లర్ టి.కిషన్ కుమార్ రెడ్డి బాద్యతలు చేపట్టనున్నారు.