హైదరాబాద్ సిటీ ఖైరతాబాద్ గణేషుడు అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు.. 11 రోజులు భక్తులకు తన విశ్వరూపంతో దర్శనం ఇస్తూ.. అలరిస్తారు. చిన్నా పెద్ద అందరూ.. పల్లె పట్నం అని తేడా లేకుండా కోట్ల మంది దర్శించుకున్నారు. మొక్కుకున్నారు.. మొక్కులు తీర్చుకున్నారు. ప్రతిఏటా వైభవంగా జరిగే ఈ వేడుకలకు.. ఈసారి భక్త జనం తండోపతండాలుగా తరలివచ్చారు.
ఇదే సమయంలో ఖైరతాబాద్ గణేషుడు హుండీ ఆదాయం రికార్డులు బద్దలు కొట్టింది. కేవలం హుండీ ఆదాయమే 70 లక్షల రూపాయలు అని స్పష్టం చేసింది కమిటీ. అంతేనా.. భారీ గణనాథుడి చుట్టూ.. పరిసరాల్లో ఏర్పాటు చేసిన వివిధ కంపెనీల ప్రకటనల ద్వారా మరో 40 లక్షల రూపాయల వరకు ఆదాయం వచ్చినట్లు సమాచారం.
అంతే కాకుండా గణనాథుడి దగ్గర ఏర్పాటు చేసిన స్కానర్లు అంటే.. గూగుల్ పే, ఫోన్ పే వంటి ఆన్ లైన్ చెల్లింపులను లెక్కించాల్సి ఉంది. ఆ వివరాలు ఇంకా వెల్లడికాలేదు. ఖైరతాబాద్ గణపతి ఉత్సవాలు ప్రారంభమైనప్పటి నుంచి మొట్ట మొదటిసారి హుండీ లెక్కింపు సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరిగింది. అంతా పారదర్శకంగా హుండీ ఆదాయాన్ని లెక్కించారు ఆలయ కమిటీ సభ్యులు.
మొత్తానికి ఖైరతాబాద్ గణనాథుడు ఆదాయం ఈసారి కోటి రూపాయలు దాటిపోయింది.. పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది..