- ఉన్న స్థలంలోనే డబుల్ రిజిస్ట్రేషన్లు చేయించేందుకు కుట్ర
- బాధితుల ఆందోళనతో వెలుగులోకి..
ఉప్పల్, వెలుగు: ప్రీ లాంచింగ్ ఆఫర్ పేరుతో కృతిక ఇన్ఫ్రా డెవలపర్స్ అనే సంస్థ 180 మంది నుంచి దాదాపు రూ.70 కోట్లు వసూలు చేసింది. కృతిక సంస్థ నిర్వాహకులు కొన్నేండ్ల కింద బోడుప్పల్లో వెంచర్వేశారు. ప్రీ లాంచింగ్ఆఫర్పేరిట ఒక్కొక్కరి నుంచి దాదాపు రూ.38 లక్షల చొప్పున రూ.54 కోట్లు వసూలు చేశారు. ఫ్లాట్లు నిర్మించి ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. కట్టిన మొత్తాన్ని బట్టి ఒక్కొక్కరి పేరు మీద దాదాపు 57 గజాల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేశారు.
అయితే అదే సైట్లో మరో 40 మందికి 75 గజాలు చొప్పున రిజిస్ట్రేషన్లు చేయిస్తానని కృతిక ఇన్ఫ్రా డెవలపర్స్ సీఈఓ శ్రీకాంత్ సోమవారం ఉప్పల్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు వచ్చాడు. విషయం తెలుసుకున్న బాధితులు ఫ్లకార్డులతో అక్కడికి చేరుకుని నిరసనకు దిగారు. దీంతో శ్రీకాంత్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం బాధితులు మాట్లాడుతూ.. కృతిక ఇన్ఫ్రా డెవలపర్స్ సీఈఓశ్రీకాంత్ 2020లో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్హేమానగర్లో రెండున్నర ఎకరాల స్థలాన్ని కొంటున్నానని, అపార్ట్మెంట్లు కట్టి ఫ్లాట్లు కేటాయిస్తానని నమ్మబలికి 140 మంది నుంచి రూ.54 కోట్లు వసూలు చేశాడని చెప్పారు.
అయితే శ్రీకాంత్ కొన్నది 2 ఎకరాల స్థలం మాత్రమేనన్నారు. అందులో 140 మందికి ముందుగా ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేశాడని తెలిపారు. అయితే మరో 40 మందికి అదే స్థలంలో ఫ్లాట్లు కట్టిస్తానని నమ్మబలికి శ్రీకాంత్2020 నుంచి 2023 వరకు దాదాపు రూ.17 కోట్లు వసూలు చేశాడని వాపోయారు. డబ్బు తీసుకున్నాక ఎలాంటి పొజిషన్ఇవ్వకపోగా, రిజిస్ట్రేషన్ చేయలేదన్నారు. సోమవారం గతంలో140 మందికి ఇచ్చిన స్థలాల్లోనే మరో 40 మందికి డబుల్రిజిస్ట్రేషన్చేయించాలని శ్రీకాంత్రిజిస్ట్రేషన్ఆఫీసుకు రాగా తాము నిరసనకు దిగామన్నారు.