Hyderabad: కూకట్పల్లిలో ఉంటున్నోళ్లు జర జాగ్రత్త.. మేటర్ ఏంటంటే..

Hyderabad: కూకట్పల్లిలో ఉంటున్నోళ్లు జర జాగ్రత్త.. మేటర్ ఏంటంటే..

కూకట్పల్లి: కూకట్పల్లిలో ప్రియాంక అనే మహిళను హత్య చేసిన నిందితురాలు మంజులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు బాలానగర్ జోన్ డీసీపీ సురేష్ కుమార్, అడిషనల్ డీసీపీ సత్యనారాయణ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. వివరాల్లోకి వెళితే కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న భాగ్యనగర్ కాలనీ ప్రాంతంలో నివసిస్తున్న ప్రియాంక అనే మహిళ వ్యభిచారం చేస్తూ జీవనం కొనసాగిస్తుంది. ఇదే వృత్తిలో ఉన్న మంజుల ఎల్లంబండా ఎన్టీఆర్ నగర్ ప్రాంతంలో నివసిస్తూ వ్యభిచారం వృత్తి కొనసాగిస్తుంది. ఇదే సమయంలో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడి ప్రియాంక దగ్గర ఉన్న చెవి పోగులు, వెండి ఆభరణాలు మంజుల దగ్గర దాచి పెట్టింది. సెప్టెంబర్ 30వ తేదీన తన బంగారం, వెండి వస్తువులు తిరిగి ఇవ్వాలని మంజులను కోరగా అందుకు ఆమె నిరాకరించింది. దీంతో ప్రియాంక తనకు తెలిసిన వారితో మంజులను బెదిరించి బంగారు చెవిపోగులు, వెండి అభరణాలను తీసుకుంది.

ఈ క్రమంలో.. ప్రియాంకతో తనకు ప్రాణ హాని ఉందని భావించిన మంజుల ఆమెతో మంచిగా ఉన్నట్లు నటించింది. ప్రియాంకను తన ఇంటికి తీసుకువెళ్లి బాగా మద్యం తాగించి అనంతరం ప్రియాంక స్కూటీ పైన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని లోధా అపార్ట్మెంట్ ముందున్న ఉదాసీన్ మఠ్ దగ్గర ఉన్న ఖాళీ స్థలం దగ్గరకు తీసుకెళ్లింది. చెత్తకుప్పలోకి ప్రియాంకను నెట్టేసి తన వెంట తెచ్చుకున్న కత్తితో మంజుల ఆమె గొంతు కోసింది.

ALSO READ | రాజేంద్రనగర్‌లో బైక్ రేసింగ్.. ఖరీదైన బైక్ లు సీజ్ 

హత్య చేసిన నేరం తన మీదకి రాకుండా ప్రియాంకను అత్యాచారం చేసి హత్య చేశారని నమ్మించడానికి ప్రియాంక బట్టలు మొత్తం చింపి, ప్రియాంక యోని పై భాగంలో బట్టలు మొత్తం తీసేసి వెళ్లిపోయినట్లు నిందితురాలు మంజుల అంగీకరించింది. నిందితురాలు మంజులను అదుపులోకి తీసుకొని విచారించగా నేరం తనే చేసినట్లు అంగీకరించింది. దీంతో అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిజామాబాద్​ జిల్లా బోధన్​ మండలం ఆమ్రాబాద్కు చెందిన ప్రియాంకకు(30) పెండ్లయి ఒక కూతురు కూడా ఉంది. కొంత కాలం క్రితం భర్తతో విడిపోగా, బిడ్డను వదిలి రెండు నెలల క్రితం హైదరాబాద్ నగరానికి వచ్చింది. ఇలా మంజుల చేతిలో హత్యకు గురై ప్రాణాలు కోల్పోయింది.