జోగులాంబ నిధుల దుర్వినియోగంపై.. లీగల్‌‌ అథారిటీ సీరియస్

జోగులాంబ నిధుల దుర్వినియోగంపై.. లీగల్‌‌ అథారిటీ సీరియస్

గద్వాల, వెలుగు : ఐదో శక్తి పీఠం జోగులాంబ అమ్మవారి ఆలయ నిధుల దుర్వినియోగంపై హైదరాబాద్‌‌ లీగల్ సర్వీసెస్‌‌ అథారిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సుమొటోగా కేసు నమోదు చేసి, ఆలయ అర్చకుడు ఆనంద్‌‌శర్మ, ఈవో పురేందర్‌‌ పాత్రపై విచారణ చేయాలని ఆదేశించింది. 

నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఏప్రిల్ నాలుగో తేదీలోగా వివరణ ఇవ్వాలని ఎండోమెంట్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌కు ఆదేశాలు జారీ చేసింది. జోగులాంబ అమ్మవారి టెంపుల్‌‌లో ఒక వైపు పూజారి వ్యవహారం, మరో వైపు నిధుల దుర్వినియోగంపై పత్రికల్లో వచ్చిన కథనాలు, ఫిర్యాదుల ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నట్లు చెబుతున్నారు.