ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో హైదరాబాద్ లిబరేషన్ డే ఫొటో ఎగ్జిబిషన్ మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్‌ను ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హైదరాబాద్ విమోచనం కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుందామని,
ఈ చరిత్రక సంఘటనలన్నింటినీ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎగ్జిబిషన్‌లోని పొటోలు రాంజీ గోండు, కుమ్రం భీం, చాకలి ఐలమ్మ తదితరుల పాత్రను క్లుప్తంగా వివరిస్తున్నాయన్నారు. ఎగ్జిబిషన్ ఈ నెల 19 వరకు కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ బి.ధర్మ నాయక్, 32 బెటాలియన్ ఎన్సీసీ కమాండెంట్ కల్నల్ వికాస్, ఆకాశవాణి ప్రోగ్రాం హెడ్ రామేశ్వర్ రావు, కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ అతీక్ బేగం, హెడ్ పోస్ట్ మాస్టర్ కె.ఉత్తమ్ కుమార్, సీబీసీ ఏపీఏ రషీద్ పాల్గొన్నారు.