హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ (టన్నెల్) రోడ్లు : కాంగ్రెస్ విజన్ 2050

భౌగోళికంగా హైదరాబాద్ కు ఉన్న స్వభావం, అనుకూలతలతో విజన్ 2050 పేరుతో అద్భుతంగా తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. నవంబర్ 14వ తేదీ మీడియాతో మాట్లాడిన ఆయన.. టెక్నాలజీ అనేది ఎంతో డెవలప్ అయ్యిందని.. వాటిని ఉపయోగించుకుంటూ హైదరాబాద్ సిటీని మరింత అభివృద్ధి చేయటానికి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు వివరించారాయన. 

ప్రస్తుతం ఫ్లైఓవర్లు, అండర్ పాస్ లు వేస్తున్నారని.. వీటికితోడు టన్నెల్ బోర్ మిషన్లతో అండర్ గ్రౌండ్ టన్నెల్స్.. రోడ్డు వేయటానికి అవకాశం ఉందన్నారు రేవంత్ రెడ్డి. హైదరాబాద్ నేల స్వభావం గట్టిగా ఉంటుందని.. టన్నెల్ రోడ్ల ద్వారా హైదరాబాద్ సిటీలో ఎక్కడి నుంచి అయినా ఎక్కడికైనా నేరుగా వెళ్లిపోవచ్చన్నారు. ప్రపంచంలో ప్రస్తుతం ఈ టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. హైదరాబాద్ మూసీ ప్రక్షాళనతో నల్గొండ వరకు ఎంతో బిజినెస్ కారిడార్ ఏర్పాటు చేయొచ్చన్నారు.

ఇక రాచకొండ గుట్టలను ఊటీలా తయారు చేయొచ్చని.. ప్రజలు, ప్రైవేట్ వ్యాపారుల భాగస్వామ్యంతో అద్భుతంగా తీర్చిదిద్దొచ్చని వివరించారాయన. ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఓ పాలసీ.. రీజనల్ రింగ్ రోడ్డు వరకు ఓ పాలసీ.. ఆ తర్వాత తెలంగాణ సరిహద్దుల వరకు మరో పాలసీలు అమలు చేస్తూ.. హైదరాబాద్ సిటీని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లొచ్చని వివరించారు రేవంత్ రెడ్డి.

 

 

ALSO READ ;- రద్దీ మార్కెట్ లో.. వ్యక్తికి తెలియకుండానే రూ.1.25లక్షలు దోచేశారు