ఇయ్యాల (ఏప్రిల్ 25) ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్.. అరగంటలో ఫలితం

ఇయ్యాల (ఏప్రిల్ 25) ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్.. అరగంటలో ఫలితం

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ శుక్రవారం జరగనుంది. జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు స్టార్ట్ కానుంది. ముందుగా బ్యాలెట్ బాక్స్ లను స్ట్రాంగ్​రూం నుంచి తీసుకొచ్చి అభ్యర్థుల సమక్ష్యంలో సీల్ ఓపెన్ చేస్తారు. తర్వాత చెల్లింపు అయ్యే బ్యాలెట్ పేపర్లను 25 చొప్పున బండిల్స్ కడతారు. మొత్తం ఓటర్లు 112 మంది ఉన్నప్పటికీ 88 ఓట్లు మాత్రమే పోల్​అయ్యాయి. లెక్కింపు మొదలైన అరగంట నుంచి గంట లోపే రిజల్ట్​వెలువడే అవకాశం ఉంది.  

ఓట్ల లెక్కింపునకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని రిటర్నింగ్ అధికారి అనురాగ్ జయంతి తెలిపారు.  ఎన్నికల పరిశీలకులు సురేంద్ర మోహన్ తో కలిసి గురువారం కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల విభాగం అడిషనల్ కమిషనర్ అలివేలు మంగతాయారు, ఇతర అధికారులు పాల్గొన్నారు.