Swiggy మోసం..బ్రాండ్ రెస్టారెంట్ల పేరుతో బ్యాడ్ ఫుడ్ అంటగడుతోంది

Swiggy మోసం..బ్రాండ్ రెస్టారెంట్ల పేరుతో బ్యాడ్ ఫుడ్ అంటగడుతోంది

స్విగ్గీలో ఆర్డర్ చేస్తున్నారా..మీరు కోరుకున్నరెస్టారెంట్ల నుంచి ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా?..మీకు ఇష్టమైన రెస్టారెండ్ ఫుడ్ టేస్ట్ లో ఏదైనా తేడా అనిపించిందా?. అయితే ఈ విషయం మీరు తెలుసుకోవాల్సిందే. 

హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో స్విగ్గీ ద్వారా ఫేమస్ రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేస్తే స్థానికంగా తయారు చేసే ఫుడ్ చేస్తున్నారట..ఫేమస్ రెస్టారెంట్ల లోగోలున్న బ్యాగులతో డీక్వాలిటీ ఫుడ్ సరఫరా చేస్తున్నారట..అనుమానం వచ్చిన ఓ కస్టమర్ ఆరా తీస్తే షాకింగ్ విషయాలు బయటికొచ్చాయి.స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేస్తే.. స్థానికం గా తయారు చేసే డీక్వాలిటీ ఫుడ్ ను సరఫరా చేస్తున్నారని సోషల్ మీడియాలో పోస్టు చేశారు.  

లింగంపల్లి రైల్వే స్టేషన్ పరిధిలోని నివసించేసే ఓ వ్యక్తి, అతని భార్య.. రుచికరమైన పిజ్జా కోసం ఓలియో నుంచి ఇటాలియన్ డిష్ ను స్విగ్గీ యాప్ ద్వారా ఆర్డర్ చేశారు. స్విగ్గీలో షాప్ లోకేషన్ కేవలం తనకు ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నట్లు చూపించడంతో కస్టమర్ కు  అనుమానం వచ్చింది. తాను ఉంటున్న సమీపంలో ఎక్కడా కూడా ఓలియో అవుట్ లెట్ లు లేవుకదా.. ఇలా చూపిస్తుంది ఏంటీ అని ఆరా తీశాడు.  చెక్ చేసేందుకు వెళ్లిన అతనికి షాకింగ్ విషయాలు తెలిశాయి.. 

ఒకే చోట్ దాదాపు 14 రకాల ఫేమస్ రెస్టారెంట్ల పేర్లతో ఓ చిన్న దుకాణం నిర్వహిస్తున్నట్లు గుర్తించాడు. వెంటనే స్విగ్గీ కసమర్ కేర్ కు కాల్ చేశాడు. పొరపాటు జరిగిందని స్విగ్గీ క్షమాపణలు చెప్పింది.. ఆర్డర్ రద్దు చేసి తిరిగి మొత్తాన్ని చెల్లించేందుకు సిద్దమైంది. 

ALSO READ | Health Alert: కంప్యూటర్ పనిచేస్తున్నపుడు.. తినాల్సిన ఆహారం..

ఆగస్టు 23 ను జరిగిన ఈ ఘటన సోషల్ మీడియా రెడ్డిట్ లో షేర్ చేయడంలో నెటిజన్లు మండిపడుతున్నారు. క్లౌడ్ కిచెన్లకు సరైన లైసెన్సులు లేవు..  సరియైన శుభ్రత పాటించడం లేదు.. అధికారులు ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంకో నెటిజన్ స్పిందిస్తూ.. స్విగ్గీ ఒకటే కాదు.. జొమాటో లో కూడా ఇలాంటి సంఘటనలే జరిగాయి.. ఇప్పటికీ నేను స్విగ్గీని నమ్మడంలేదు.. స్విగ్గీ రేటింగ్ కేవలం గౌర్మెట్ కేటగిరీ స్కామ్ అని రాశాడు. 

ఏదీ ఏమైనా ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేయాలంటే.. భయంగా నే ఉంది.. కానీ పని బిజీ లో ఆర్డర్ చేయకతప్పడం లేదు అంటున్నారు కొందరు నెటిజన్లు.. మరో నెటిజన్ స్పందిస్తూ ఫుడ్ సేఫ్టీ అధికారులు హైదరాబాద్ సిటీలోని రెస్టారెంట్లపై దాడులు నిర్వహించిన నాణ్యమైన ఫుడ్ అందించేలా చర్యలు తీసుకోవాలని కొందరు నెటిజన్లు కోరుతున్నారు.  

మరిన్ని వార్తలు