మామిడికాయల కోసం వెళ్లి.. కరెంట్​షాక్​తో వ్యక్తి మృతి

మామిడికాయల కోసం వెళ్లి.. కరెంట్​షాక్​తో వ్యక్తి మృతి

శంషాబాద్, వెలుగు: మామిడికాయల కోసం వెళ్లి కరెంట్​షాక్​తో వ్యక్తి మృతి చెందాడు. హైదారబాద్ మెహిదీపట్నంకు చెందిన చేతన్ రెడ్డికి ఆరు నెలల కిందట పెండ్లి అయింది.  తన భార్యతో మొయినాబాద్ భాస్కర లా కాలేజీలో గురువారం పరీక్ష రాసి తిరుగు వెళ్తున్నారు.  మార్గమధ్యలో పెద్ద షాపూర్ పరిధిలోని ఓ మామిడి తోటలో పండ్లు తెంపడానికి చేతన్ మామిడి చెట్టు ఎక్కాడు. 

చెట్టుపై పక్కనే ఉన్న ట్రాన్స్​ఫార్మర్ విద్యుత్ వైర్లు గమనించకపోవడంతో.. కరెంట్​షాక్​ తగిలి మృతి చెందాడు. సమాచారం అందుకున్న శంషాబాద్​రూరల్​ పోలీసులు చేతన్ ​డెడ్​బాడీని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.