KYC అప్‌డేట్ అన్నాడు.. క్రెడిట్ కార్డు నుంచి లక్షా 22 వేలు కొట్టేశాడు

KYC అప్‌డేట్ అన్నాడు.. క్రెడిట్ కార్డు నుంచి లక్షా 22 వేలు కొట్టేశాడు

సైబర్ నేరస్తులు రోజురోజుకు కొత్త కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. కేవైసీ అప్ డేట్ అని చెప్పి నమ్మించి రూ.లక్షా 20వేలు కొట్టేశాడు ఓ కేటుగాటు. హైదరాబాద్ కు చెందిన 62ఏళ్ల వ్యక్తికి ఫెడరల్ బ్యాంక్ కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ అని కాల్ చేశాడు ఓ గుర్తు తెలియని వ్యక్తి. ఎక్కవ లిమిట్ ఇస్తా..  క్రెడిట్ కార్డ్ తీసుకోండి అని నమ్మించాడు. కొత్త క్రెడిట్ కార్డ్ ఇస్తున్నా అని  KYC, ఓటీపీ డిటేల్స్ తెలుసుకున్నాడు.

తర్వాత కార్డ్ KYC డిటేల్స్ అడిగి తెలుసుకున్నాడు. ఓటీపీని కూడా తెలుసుకున్నాడు. కొద్దిసేపటికే తన క్రెడిట్ కార్డు నుంచి రూ.లక్షా 22వేల 350 విత్‌డ్రా అయినట్లు నోటిఫికేషన్‌ వచ్చింది. వెంటనే తాను మోసపోయానని తెలుకున్న బాధితుడు ఘటనపై ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశాడు.