హైదరాబాద్ లో దొంగలు రెచ్చిపోతున్నారు. ఇళ్లు,ఆఫీసులు, దేవుడి గుళ్లు వేటిని వదలడం లేదు. యధేచ్చగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం గణేష్ ఉత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే . అయితే కొందరు కేటుగాళ్లు గణేశ్ మండపాలను టార్గెట్ చేసుకుని దొంగతనాలు చేస్తున్నారు. లేటెస్ట్ గా మియాపూర్ లోని ఓ గణేశ్ మండపంలో ఓ వ్యక్తి గణేశ్ చేతిలో నుంచి 11 కిలోల లడ్డూను చోరీ చేశాడు.
మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మదీనగూడ జాతీయ రహదారిపై ‘ఓంకార్ సేవా సమితి’ అనే స్థానిక యువజన బృందం గణేష్ మండపం ఏర్పాటు చేసింది. సెప్టెంబర్ 20న బుధవారం తెల్లవారుజామున 4:20 గంటలకు 22 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న ఓ వ్యక్తి గణేష్ మండపలోకి వెళ్లి 11 కిలోల లడ్డూ తీసుకుని పారిపోయాడు. ఆ సమయంలో నిర్వాహకులు పడుకున్నారు.
Also Read : తెలంగాణలో మూడ్రోజులు వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
ఈ చోరీ దృశ్యాలు మండపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ చోరీపై నిర్వాహకులు వెంటనే మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.