తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ హరితహారం అనే ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్ కింద హైదరాబాద్చుట్టుపక్కల ఐదు అర్బన్ ఫారెస్ట్ పార్కులను అభివృద్ధి చేయడానికి రెడీ అయింది. ఇందులో భాగంగా మంచిరేవులలో ఫారెస్ట్ ట్రెక్ పార్కును ముఖ్యమంత్రి కేసీఆర్ప్రారంభించి, కోటి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. నార్సింగి పోలీస్అకాడమీ, అప్పా జంక్షన్ మధ్య, చిల్కూరు రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్ శంషాబాద్ డివిజన్ లోని మంచిరేవులలో 100 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఫారెస్ట్ పార్కు విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. మంచిరేవుల ఫారెస్ట్పార్కులో నేచురల్‌గా ఉన్న బండరాళ్లపై అందమైన పెయింటింగ్స్ వేశారు.
ఇవి సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. కొండలతో కూడిన ఈ ప్రాంతం, మెలికలు తిరిగి ఉన్న జలప్రవాహాలు, నీటి వనరులు, సహజంగా ఏర్పడ్డ రాళ్లతో అందంగా ఉంది.ఇంతకుముందు, ఈ ప్రదేశాన్ని నిర్మాణాలు, భవన వ్యర్థాలకు డంపింగ్ గ్రౌండ్‌గా వినియోగించారు. అర్బన్ ఫారెస్ట్ పార్క్ కాన్సెప్ట్ కింద ఈ ప్రాంతం ట్రెక్కింగ్ కి అనువుగా తీర్చిదిద్దారు. రూ.7 కోట్ల 38 లక్షలతో దీనిని పర్యాటకంగా అభివృద్ధి చేశారు. ఇందులో భాగంగా ట్రెక్కింగ్‌తో పాటు మొక్కల పెంపకం, కంపౌండ్‌వాల్ నిర్మాణం తదితర అభివృద్ధి పనుల్ని చేపట్టారు.
- గ్రీనరీకి ప్రాధాన్యత ఇచ్చారు
- HMDA, అటవీ శాఖ కలిపి దాదాపు 4.5 కి.మీ కంపౌండ్ వాల్ని నిర్మించింది.
- ఖాళీ ప్రదేశాల్లో సుమారు 50 వేల స్థానిక జాతుల మొక్కలు నాటారు.
- పర్యాటకుల ద్వారా నెలకు రూ. 3 లక్షల ఆదాయం రాబట్టాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు
- రాళ్లపై జంతువుల పెయింటింగ్‌తో పాటు ప్రత్యేకంగా బ్యాలెన్సింగ్ రాక్స్, బేబీ ఎలిఫెంట్, డేగ ముఖం తదితర చిత్రాలు పిల్లలను ఆకర్షిస్తున్నాయి.
- పార్కులో అభివృద్ధి చేసిన చిన్నచెరువు, పెద్దమ్మచెరువు, చెక్ డ్యాం ఈ ప్రాంతాన్ని మరింత సుందరంగా మార్చాయి.
- ఇది బొటానికల్ గార్డెన్, KBR నేషనల్ పార్క్ అంతటి అర్బన్ ఫారెస్ట్ పార్క్ అని అధికారులు చెబుతున్నారు.