
- మరో రెండు, మూడు నెలల్లో డ్రాఫ్ట్
- ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణ తర్వాత తుది ప్లాన్
- 13వేల చదరపు కిలోమీటర్లకు విస్తరించనున్న హెచ్ఎండీఏ
హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు హెచ్ఎండీఏ రూపొందిస్తున్న మాస్టర్‌ప్లాన్–2030ని ఈ డిసెంబర్‌నాటికి అందుబాటులోకి తీసుకురాబోతున్నది. ప్రభుత్వం కొన్ని నెలల కింద బల్దియా పరిధిలోకి శివారులోని 51 గ్రామాలను కలిపి గెజిట్నోటిఫికేషన్రిలీజ్చేయగా, దీనికి తగ్గట్టుగా..2030 నాటి అవసరాలకు అనుగుణంగా హెచ్ఎండీఏ కొత్త మాస్టర్ ప్లాన్‌కు రూపకల్పన చేస్తోంది. రెండు, మూడు నెలల్లో డ్రాఫ్ట్ మాస్టర్ప్లాన్రిలీజ్చేయనున్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు, సలహాలు, సూచనలను తీసుకుని, డిసెంబర్వరకు తుది మాస్టర్‌ప్లాన్ ప్రకటించనున్నారు.
అన్ని మాస్టర్ ప్లాన్లు ఒకే ప్లాన్‌గా..
ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధిలో ఐదు మాస్టర్ప్లాన్లు ఉన్నాయి. ఇందులో కోర్‌సిటీ, బల్దియా, ఎయిర్పోర్ట్అథారిటీ, సైబరాబాద్ డెవలప్మెంట్అథారిటీ, ఎక్స్టెండెడ్ ఏరియా డెవలప్మెంట్మాస్టర్ప్లాన్ ఉన్నాయి. ఇలా ఐదు వేర్వేరు ప్లాన్లు ఉండడం వల్ల పరిపాలనలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని ప్రాంతాలు రెండు మాస్టర్ప్లాన్లలో ఉండడం, నిర్మాణదారులు పర్మిషన్లు తీసుకునేప్పుడు కూడా వేర్వేరు మాస్టర్ప్లాన్లకు అనుగుణంగా అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఎన్ఓసీలు, అడ్రస్‌లకు సంబంధించిన సమస్యలు కూడా వస్తున్నాయి. దీంతో ఐదు మాస్టర్ప్లాన్లను కలిపి యూనిఫైడ్మాస్టర్ప్లాన్ గా రూపొందించాలనుకుంటున్నారు.
లాభాలెన్నో..
ఐదు మాస్టర్ప్లాన్లను ఒకే మాస్టర్‌ప్లాన్‌గా రూపొందించడం వల్ల ఒక నిర్మాణం కోసం లేక ఎన్ఓసీ కోసం వచ్చేవారికి ఒకే చోటు నుంచి అనుమతులు ఇవ్వవచ్చని అధికారులు చెప్తున్నారు. మోడ్రన్టెక్నాలజీతో గూగుల్‌మ్యాప్స్, లోకల్ రెవెన్యూ మ్యాప్‌లు, విలేజ్మ్యాప్లను నేషనల్జియోగ్రాఫిక్ రీసెర్చ్ఇన్స్టిట్యూట్, నేషనల్రిమోట్ సెన్సింగ్ఏజెన్సీ ద్వారా ఒక పద్ధతిలో రూపొందించవచ్చంటున్నారు. దీని వల్ల ప్రస్తుత తప్పులను సరిదిద్దడానికి అవకాశం ఉంటుందంటున్నారు. మాస్టర్‌ప్లాన్–2050 వరకూ నగరం మరింతగా విస్తరించే అవకాశం ఉన్న దృష్ట్యా అప్పటి అవసరాలకు అనుగుణంగా రోడ్ కనెక్టివిటీ, రెసిడెన్షియల్జోన్స్, ఇండస్ట్రియల్జోన్స్, అర్బన్‌నోడ్స్, గ్రీన్‌జోన్స్, గ్రిడ్ రోడ్లను పక్కాగా ప్లాన్‌లో పొందుపరుస్తున్నట్టు అధికారులు తెలిపారు.
కలవనున్న నాలుగు జిల్లాలు
ప్రస్తుతం హెచ్ఎండీఏ 7,257 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. కొత్తగా చేరే ప్రాంతాలతో కలిపి 13,000 చదరపు కిలోమీటర్లు విస్తరించనుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం హెచ్ఎండీఏలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సిద్దిపేట, యాదాద్రి, మెదక్, సంగారెడ్డి ఉండగా.. త్వరలో మరో నాలుగు జిల్లాలు నల్గొండ, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, వికారాబాద్విలీనం చేయనున్నారు. ప్రస్తుతం 32 మండలాలు ఉండగా, మరో 73 మండలాలను కూడా విలీనం చేసుకోనున్నారు. ప్రస్తుతం ఉన్న 6 జోన్లను 10 జోన్లుగా ఏర్పాటు చేయనున్నారు. హెచ్ఎండీఏ పరిధిలోని 3,600 చెరువులను రక్షించడానికి బ్లూ అండ్గ్రీన్పేరిటి స్పెషల్ ప్లాన్‌ను కూడా రూపొందించనున్నట్టు అధికారులు తెలిపారు.