హైదరాబాద్ లో సాయంత్రం భారీ వర్షం పడే ఛాన్స్.. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్ళేటప్పుడు జాగ్రత్త..

హైదరాబాద్ లో సాయంత్రం భారీ వర్షం పడే ఛాన్స్.. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్ళేటప్పుడు జాగ్రత్త..

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. మండే ఎండల నుంచి ఈ వర్షాలు కాస్త రిలీఫ్ ఇస్తున్నప్పటికీ.. రైతులు మాత్రం చేతికి వచ్చిన పంట నష్టపోయి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నగరాల్లో రోడ్లు జలమయమయ్యి వాహనదారులు అవస్థపడుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం ( ఏప్రిల్ 8 ) హైదరాబాద్ లో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని.. బలమైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.

ఈ క్రమంలో హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అయితే.. గత వారంలో కురిసినంత భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని తెలిపింది వాతావరణ శాఖ. ఇదిలా ఉండగా సోమవారం ( ఏప్రిల్ 7 ) హైదరాబాద్ లోని ముషీరాబాద్ ఏరియాలో 39.2 డిగ్రీల గరిష్ట ఉద్నోగ్రత నమోదయ్యింది.

తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇవాళ, రేపు ( ఏప్రిల్ 8, 9 ) అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. సోమవారం  ( ఏప్రిల్ 7 ) నిర్మల్ జిల్లాలో 41.2 గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇవాళ, రేపు వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి వాతావరణం చల్లబడే ఛాన్స్ ఉందని తెలిపింది వాతావరణ శాఖ.