ఈ తేదీల్లో జాగ్రత్త.. తెలంగాణలో ఉరుములు, మెరుపులతో ఊదురుగాలుల బీభత్సం తప్పదా..

ఈ తేదీల్లో జాగ్రత్త.. తెలంగాణలో ఉరుములు, మెరుపులతో ఊదురుగాలుల బీభత్సం తప్పదా..

రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కంటే  అదనంగా 4నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. పది దాటితే బయటికి వెళ్లాలంటే జనం భయపడిపోతున్నారు. అయితే ఎండలు,తీవ్రమైన వేడితో సతమతమవుతున్న తెలంగాణ వాసులకు కొంత ఊరట. రాష్ట్రంలో పలుచోట్ల మరో మూడు రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వానలు, తుఫాను సంభవించే అవకాశం కూడా ఉందని హెచ్చరించింది. 

ముఖ్యంగా హైదరాబాద్ లో మార్చి 22 నుంచి మూడు రోజుల పాటు వాతావరణం పూర్తిగా మారిపోతుంది..వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావారణ శాఖ తెలిపింది. ఇక తెలంగాణలోని మిగతా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వడగండ్ల వానలు కురుస్తాయని తెలిపింది.

తెలంగాణలో ఉరుములు, బలమైన ఈదురుగాలులు, వడగళ్ల తుఫానులు సంభవించే అవకాశం ఉంది. మార్చి 22న సెంట్రల్, నార్త్ తెలంగాణతో ప్రారంభమై  మార్చి 23, 24న దక్షిణ, తూర్పు తెలంగాణ వరకు విస్తరించే అవకాశం ఉంది. తూర్పు తెలంగాణలో తీవ్రమైన తుఫానులు సంభవించే అవకాశం ఉంది. 

మార్చి 22, 23 తేదీల్లో తెలంగాణలోని మంచిర్యాలు, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, దిలాబాద్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, మెదక్‌, సంగారెడ్డి, వికారాబాద్‌, నారాయణపేట, గద్వాల్‌లలో కూడా ఈదురు గాలులుతో కూడిన తుఫానుకు అవకాశం ఉంది. 

మరోవైపు ఇదే 22, 23తేదీల్లో హైదరాబాద్ నగరంతో పాటు మరో 17 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.  నిర్మల్, ఆసిఫాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, జనగాం, మేడ్చల్, యాదాద్రి, సూర్యాపేట, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్, వనపర్తి , నాగర్‌కర్నూల్ జిల్లాల్లో వడగండ్ల  వానలు, బలమైన గాలులు కూడా వీచే అవకాశం ఉంది.