హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మికి అస్వస్థత..

హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి స్వల్ప అస్వస్థకు గురయ్యారు. సోమవారం ( సెప్టెంబర్ 30, 2024 ) అస్వస్థతతో హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. విజయలక్ష్మికి డాక్టర్లు పలు టెస్టులు నిర్వహించినట్లు సమాచారం. ఛాతి నొప్పితో ఆసుపత్రిలో చేరిన విజలక్ష్మికి పలు టెస్టులు నిర్వహిచిన డాక్టర్లు.. ప్రమాదమేమీ లేదని, ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలిపారు. 

2024 వరకు బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా ఉన్న విజయలక్ష్మి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2021లో హైదరాబాద్ మేయర్ గా ఎన్నికయ్యారు విజయలక్ష్మి.