హైదరాబాద్ మేయర్‌‌‌‌ గద్వాల్‌‌ విజయలక్ష్మిపై కేసు నమోదు

  • బతుకమ్మ వేడుకల్లో డీజే వాడకంపై సుమోటోగా కేసు 

పంజాగుట్ట, వెలుగు: హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మిపై కేసు నమోదైంది. బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా డీజే వాడడంతో పాటు అధిక డెసిబుల్స్‌‌తో సౌండ్ పెట్టి రూల్స్ బ్రేక్​చేయడం, అనుమతి ఇచ్చిన సమయం కంటే ఎక్కువ సేపు కార్యక్రమం నిర్వహించడంపై బంజారాహిల్స్ పోలీసులు ఆమెపై సుమోటోగా కేసు నమోదు చేశారు.

శుక్రవారం సద్దుల బతుకమ్మ కార్యక్రమాన్ని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఎన్బీటీ నగర్‌‌‌‌లో​నిర్వహించారు. ఈ సందర్భంగా వేడుకల్లో డీజే వాడారని, అనుమతించిన దానికంటే అధిక డెసిబుల్ సౌండ్​పెట్టడంతో మేయర్‌‌‌‌పై కేసు నమోదు చేసినట్టు బంజారాహిల్స్ ఏసీపీ సామల వెంకట్‌‌ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.