మెట్రో స్టేషన్ల దగ్గర పెయిడ్ పార్కింగ్ అమలుపై ఇటీవలే మెట్రో కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమల్లో ఉన్న ఫ్రీ పార్కింగ్ ను ఎత్తేసి సెప్టెంబర్ 1నుండి పెయిడ్ పార్కింగ్ అమలు చేయనున్నట్లు ప్రకటించింది. మెట్రో అధికారుల నిర్ణయంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమైంది. మెట్రోస్టేషన్ల వద్ద పెయిడ్ పార్కింగ్ అమలు చేయడంపై మెట్రో అధికారులు మరోసారి వెనక్కి తగ్గారు.
పెయిడ్ పార్కింగ్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 25న మహాధర్నాకు పిలుపునిచ్చారు మెట్రో ప్రయాణికులు. ఈ క్రమంలో పెయిడ్ పార్కింగ్ నిర్ణయంపై మెట్రో అధికారులు వెనక్కి తగ్గారు.ప్రయాణికుల సమస్యలను పరిష్కరించేందుకు పెయిడ్ పార్కింగ్ అమలును వాయిదా వేస్తున్నట్లు, తదుపరి నిర్ణయం త్వరలోనే ప్రకటిస్తామని ప్రకటించింది ఎల్ అండ్ టీ మెట్రో.