హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్‌మెట్రో మరోసారి గ్రీన్‌చానెల్ ద్వారా గుండెను తరలించి వ్యక్తి ప్రాణాలను కాపాడింది. శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో ఎల్బీ నగర్ కామినేని హాస్పిటల్ నుంచి ప్రత్యేక రైల్‌ను ఏర్పాటు చేశారు డాక్టర్లు.
డాక్టర్ల పర్యవేక్షణలో కేవలం 13 నిమిషాల్లోనే గ్లెనీగల్స్ గ్లోబల్ హాస్పిటల్‌కు గుండెను విజయవంతంగా చేర్చింది. యాక్సిడెంట్‌కు గురైన వ్యక్తి గుండెను జీవన్ దాన్ ద్వారా సేకరించి 34 ఏండ్ల వ్యక్తికి అమర్చినట్లు సమాచారం.