ఆఫర్స్ కంటిన్యూ: ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్

ఆఫర్స్ కంటిన్యూ: ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్

హైదరాబాద్: ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూ్స్ చెప్పింది. సూపర్ సేవర్ ఆఫర్ -59, స్టూడెంట్ పాస్ ఆఫర్, సూపర్ సేవర్ ఆఫ్- పీక్ వంటి ఆఫర్లకు ప్రయాణికుల నుండి విశేష ఆదరణ వస్తుండటంతో.. ఈ ఆఫర్ల గడువును మార్చి 31, 2025 వరకు పొడిగిస్తున్నట్లు మెట్రో యాజమాన్యం ఇవాళ (సెప్టెంబర్ 30) ప్రకటించింది. ఇవాళ్టితో ఈ ఆఫర్ల డెడ్ లైన్  ముగియనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. 

ALSO READ | ట్రాఫిక్ తిప్పల్లేకుండా విజయవాడకు ఈ- గరుడ బస్సులు

మెట్రో ప్రయాణాన్ని ప్రయాణీకులందరికీ  మరింత చేరువ చేసేందుకు ఈ ఆఫర్లు పొడిగిస్తూన్నట్టు సంస్థ ప్రకటించింది. ఈ నిర్ణయం ప్రయాణికులకు మెట్రో సరసమైనదిగా మారడటంతో పాటు.. మెట్రో ప్రయాణం అనుకూలమైన ఎంపికగా మార్చడానికి ఉపయోగపడుతోందని పేర్కొంది. ఆఫర్ల గడువును పెంచుతూ మెట్రో తీసుకున్న నిర్ణయంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

మెట్రో ఆఫర్లు:

1. సూపర్ సేవర్ ఆఫర్-59
ఈ ఆఫర్ ద్వారా.. సెలవు రోజుల్లో  కేవలం రూ.59తో ఒకరోజు మెట్రోలో అపరిమితంగా ప్రయాణించవచ్చు. 

2.స్టూడెంట్ పాస్ ఆఫర్: 
ఈ ఆఫర్ కింద.. విద్యార్థులు 20 ట్రిప్పులకు డబ్బులు చెల్లించి 30 ట్రిప్పులు ప్రయాణించవచ్చు.

3.సూపర్ సేవర్ ఆఫ్-పీక్ ఆఫర్: 
రద్దీ లేని సమయాల్లో ప్రయాణిస్తున్నప్పుడు కాంటాక్ట్‌లెస్ స్మార్ట్ కార్డ్‌లపై (సీఎస్‎సీలు) 10% తగ్గింపు